తిరుమలలో రష్.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తమిళనాడు నుంచి ఎక్కువ మంది భక్తులు రావడంతో తిరుమల భక్తులతో కిక్కిరిసి పోయింది
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తమిళనాడు నుంచి ఎక్కువ మంది భక్తులు రావడంతో తిరుమల భక్తులతో కిక్కిరిసి పోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శిలా తోరణం వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం....
300 రూపాయలు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న రాత్రి క్యూలైన్ లలోకి భక్తల ప్రవేశాన్ని నిలిపేసిన టీటీడీ ఈరోజు ఉదయం అనుమతించింది. నిన్న తిరుమల శ్రీవారిని 81,034 భక్తులు దర్శించుకున్నారు. 47,312 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.24 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.