Rathasaptami : నేడు రథసప్తమి... తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా
నేడు రథసప్తమి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఆలయాల్లో పూజలు చేసేందుకు భక్తులు బారులు తీరారు
నేడు రథసప్తమి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఆలయాల్లో పూజలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. రథసప్తమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి సూర్యభగవాడుని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తుంది. రథసప్తమి వేళ తిరుమలలో వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. తిరుమలలో నేడు సర్వదర్శనం టోకెన్లు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేశారు. సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో స్వామివారు విహరించనున్నారు. రథసప్తమి సందర్భంగా తిరుమలను సుందరంగా ముస్తాబు చేశారు.
ఉత్తరం నుంచి దక్షిణం వరకూ...
ఏటా మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యజయంతి సందర్భంగా రథసప్తమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు సూర్యజయంతిని జరుపుకుంటుారు. ఈరోజు నుంచే సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తర దిశకు ప్రయాణిస్తారని చెబుతారు. ఈరోజు పితృదేవతలకు తర్పణాలను కూడా విడుస్తారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా రుగుతున్నాయి. ఆలయానికి తెల్లవారు జామునుంచే భక్తులు పోటెత్తారు.