రేపు శ్రీ సత్యాసాయి జిల్లాకు జగన్

రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీ సత్యాసాయి జిల్లాలో పర్యటిస్తారు. చెన్నే కొత్తపల్లిలో జగన్ పర్యటించనున్నారు.

Update: 2022-06-13 07:11 GMT

రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీ సత్యాసాయి జిల్లాలో పర్యటిస్తారు. చెన్నే కొత్తపల్లిలో జగన్ పర్యటించనున్నారు. అక్కడ 2021 ఖరీఫ్ కు సంబంధించిన పంటల బీమా పరిహారాన్ని రైతులకు అందచేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్దిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు.

షెడ్యూల్ ఇదే....
రేపు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరున్నారు. ఉదయం 10.50 గంటలకు చెన్నే కొత్తపల్లికి జగన్ చేరుకోనున్నారు. 12.45 గంట వరకూ అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత పంటల బీమా మొత్తాన్ని రైతులకు అందచేస్తారు. తిరిగి మధ్యాహ్నం 2.50 గంటలకు తాడేపల్లి కార్యాలయానికి చేరుకుంటారు.


Tags:    

Similar News