టీటీడీ కీలక నిర్ణయాలివే

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు

Update: 2023-04-15 13:39 GMT

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. వేసవిలో సామాన్యభక్తుల దర్శన కల్పనే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపు కుదిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన వస్తువులతో ఇకపై శ్రీవారి లడ్డూలు తయారు చేస్తామని తెలిపారు. దానితోనే భక్తులకు వితరణ చేసే అన్నప్రసాదం తయారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

శ్రీనివాస సేతు నిర్మాణం పూర్తికి...
మార్కట్ గోడౌన్ పునఃనిర్మాణానికి రూ.18 కోట్లు, కోల్డ్ స్టోరేజ్ పునఃనిర్మాణానికి రూ.14 కోట్లు, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం పునఃనిర్మాణానికి ఆధునికీకరణకు రూ. 3 కోట్లు . తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62 కోట్లు మంజూరు చేశారు. న్యూఢిల్లీలో ఉన్న టీటీడీ ఎస్వీ కళాశాల ఆడిటోరియం ఆధునీకరణకు 4 కోట్ల రూపాయలతో ఆధునికీరించానని సమావేశం నిర్ణయించింది. మే 2వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరపాలని, శ్రీనివాససేతు నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News