నేటితో వైకుంఠ ద్వారదర్శనం నిలిపివేత

ఈరోజుతో తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ అధికారులు నిలిపివేశారు.

Update: 2022-01-22 02:42 GMT

ఈరోజుతో తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ అధికారులు నిలిపివేశారు. ఈనెల 12వ తేదీ నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. అనేక మంది వీవీఐపీలు దర్శించుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి.

సిఫార్సు లేఖలను....
ప్రతి ఏటా వైకుంఠ ద్వార దర్శనానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే అనుమతి ఇస్తారు. కానీ ఈసారి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి. ఈ పది రోజుల్లో ఎలాంటి సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించలేదు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో తిరుమలలో దర్శనాల సంఖ్యను కూడా తగ్గించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలకు మాత్రం భక్తుల రాక మాత్రం తగ్గలేదు.


Tags:    

Similar News