ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు రెండు కీలక కేసులు విచారణకు రానున్నాయి;
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు రెండు కీలక కేసులు విచారణకు రానున్నాయి. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతులు ఇవ్వాలని బెయిల్ షరతులు సడలించాలని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తికరంగా మారింది. షరతులు సడలించవద్దని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు కోరే అవకాశముంది. అదే సమయంలో మరొక కీలక కేసు కూడా ఈ రోజు విచారణకు రానుంది.
ముందస్తు బెయిల్...
మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. అదే సమయంలో మంత్రి సత్యకుమార్ కాన్వాయ్ పై దాడి యత్నం ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ముందస్తు బెయిల్ పిటీషన్ ను నేడు విచారణ చేయనుంది. ఇక మరో వైపు వైసీపీకి చెందిన పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు వెలువరించనుంది. పుంగనూరు అలర్ల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిధున్ రెడ్డి పిటీషన్ వేశారు.