పోలవరం ప్రాజెక్టు పూర్తికి ప్రతి పైసా సాయం చేస్తాం

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తెలిపారు

Update: 2022-03-04 13:31 GMT

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉందని, అందుకే ఖర్చును తాము భరిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ను పూర్తిస్థాయిలో తాను పరిశీలించానని, సమస్యలను తెలుసుకున్నానని, వెంటనే పరిష్కరించాలని సంబధిత అధికారులను ఆదేశించినట్లు గజేంద్ర షెకావత్ తెలిపారు.

ప్రతి 15 రోజులకు....
పోలవరం ప్రాజెక్టు పనులను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తాను స్వయంగా సమీక్ష చేస్తానని చెప్పారు. ఈ నెల 15వ తేదీలోగా పోలవరం పెండింగ్ డిజైన్లపై తుదినిర్ణయం తీసుకుంటుందని గజేంద్ర షెకావత్ చెప్పారు. నిర్వాసితులకు డీబీటీ విధానంలో చెల్లింపులు చేసే ప్రతిపాదనకు కూడా మంత్రి అంగీకరించారు. పోలవరం ప్రాజెక్టును సరైన సమయంలో పూర్తి చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని గజేంద్ర షెకావత్ తెలిపారు.


Tags:    

Similar News