ఏపీ రాజధాని అమరావతి .. స్పష్టం చేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు;

Update: 2022-02-02 06:45 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. తన వద్ద ఉన్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమేనని చెప్పారు.

అప్పటి ప్రభుత్వం...
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి అప్పటి ప్రభుత్వం రాజధానిని అమరావతిగా నిర్ణయించిందని చెప్పారు. అంతకు మించిన సమాచారం తన వద్ద లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతి మాత్రమేనని తెలిపారు. అయితే అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలులో న్యాయరాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నట్లు తాము మీడియా ద్వారానే తెలుసుకున్నామని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.


Tags:    

Similar News