వేమిరెడ్డికి విజయసాయిరెడ్డి ఘాట్ కౌంటర్
తనపై టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించారు;

Vijaya Sai Reddy
తాను గెలిస్తే ఢిల్లీకి ఎక్స్ పోర్ట్ అవుతానంటూ టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించారు. నెల్లూరును పట్టించుకోనని వేమిరెడ్డి గారు ఛలోక్తులు విసురుతున్నారన్నారు. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్‌లు చేస్తున్నందు వలన అలవాటు ప్రకారం ఆయన ఆ పదం వాడి ఉంటారని విజయసాయిరెడ్డి అన్నారు. తనకు ఏ వ్యాపారాలు లేవని ఆయన తెలిపారు.
సభకు ఎప్పుడైనా వచ్చావా?
పార్లమెంటు సమావేశాలప్పుడు తప్ప మిగిలిన రోజులు నెల్లూరులోనే ఉంటానని ఆయన చెప్పారు. ప్రాణం పోయేవరకు జగన్ వెంటే ఉంటానని, పార్టీలు మారడం తనకు తెలియదని, రాజ్యసభ సభ్యుడిగా ప్రతి రోజూ తాను సభకు హాజరయ్యానని. రాష్ట్ర సమస్యలను ఎక్కువగా ప్రస్తావించింది తానేనని అన్నారు. మీరు రాజ్యసభ మెంబరుగా అటు పార్లమెంటుకు రాలేదని, నెల్లూరులో లేరని. వ్యాపార పనుల్లో దేశాలు తిరుగుతున్నారని వేమిరెడ్డిపై విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.