Rain Alert: ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం

భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ

Update: 2024-09-10 03:41 GMT

21 రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం సోమవారం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరాన్ని తాకడంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. తీరప్రాంత జిల్లాల్లో సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కేరళ మరియు కర్ణాటకలలో వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ లో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభాంతో సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కళింగపట్నం, విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు కొనసాగిస్తున్నారు.


Tags:    

Similar News