వీకెండ్ ఎఫెక్ట్.. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

శనివారం శ్రీవారిని 84,430 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా..;

Update: 2023-07-23 04:35 GMT

tirumala rush today

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతపు సెలవులు కావడంతో.. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం స్వామివారి సర్వదర్శనానికి భక్తులతో క్యూ కాంప్లెక్స్ లో గల 31 కంపార్టుమెంట్లు నిండిపోగా.. క్యూ లైన్లు కాంప్లెక్స్ వెలుపలికి పెరిగాయి. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

శనివారం శ్రీవారిని 84,430 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిన్న భక్తులు సమర్పించిన వివిధ కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. అలాగే 38,662 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు. కాగా.. రేపు (జులై24) ఉదయం 11 గంటలకు టిటిడి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లను కూడా విడుదల చేయనుంది. జులై 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది. ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించి 4 వేల చొప్పున అదనపు కోటా టికెట్లను, అక్టోబర్ నెలకు సంబంధించి 15 వేల చొప్పున టికెట్లను విడుదల చేయనుంది.


Tags:    

Similar News