Breaking: మచిలీపట్నం వైసీపీ ఎంపీ ఖరారయినట్లే.. ఆయనకే చెప్పేశారట
మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిని పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది;
మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిని పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. సింహాద్రి రమేష్ పేరును దాదాపుగా నిర్ణయించింది. అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను ఈసారి మచిలీపట్నం పార్లమెంటు నుంచి పోట ీచేయాలని కోరడంతో దానికి అంగీకరించినట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. మచిలీలపట్నం ఎంపీ బాలశౌరి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేసినట్లు తెలిసింది.
జగన్ ఏదంటే అదే...
తాను జగన్ చెప్పినట్లు నడుచుకుంటానని సింహాద్రి రమేష్ తెలిపారు. తనను బందరు పార్లమెంటుకు పోటీ చేయాలని చెప్పారన్న సింహాద్రి రమేష్, ఎమ్మెల్యే అయినా, ఎంపీగా అయినా జగన్ చెప్పినట్లే పోటీ చేస్తానని తెలిపారు. జగన్ వెంటే తాను నడుచుకుంటానని చెప్పారు. అయితే తాను చిన్నవాడినని, సరిపోతానో లేదో అని ఆయన అన్నారు. అధినాయకత్వం మాత్రం యువనేత అయిన సింహాద్రి రమేష్ అయితేనే మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి సరైన అభ్యర్థి భావిస్తుంది.