విజయసాయి కీలక వ్యాఖ్యలు.. ఎన్నికలు వస్తున్నాయంటూ?

వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. జమిలీ ఎన్నికలపై ఆయన స్పష్టత ఇచ్చారు.;

Update: 2024-11-03 05:43 GMT
vijayasai reddy, ycp rajya sabha member,  lookout notices, ap cid

vijayasai reddy

  • whatsapp icon

వైసీపీ రాజ్యసభ సభ్యులు సంచలన కామెంట్స్ చేశారు. జమిలీ ఎన్నికలపై ఆయన స్పష్టత ఇచ్చారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపు నిచ్చారు. 2027లో మళ్లీ ఎన్నికలకు రానున్నాయని విజయసాయిరెడ్డి అన్నారు.

సమాయత్తం కావాలని...
ఈ ఎన్నికలకు అందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ సారి గెలుపు మనదేనని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈసారి వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని విజయసాయిరెడ్డి అన్నారు. కార్యకర్తలు అందరూ పార్టీ గెలుపునకు కృషి చేయాలని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇప్పటి నుంచే ప్రజల వద్దకు వెళ్లి వైసీపీని బలోపేతం చేయాలని ఆయన కోరారు.


Tags:    

Similar News