Big Breaking : జగన్ కు షాక్... రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు;

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేయబోతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోవడం లేదని, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని ఆయన తెలిపారు. తనకు, చంద్రబాబుకు మధ్య వ్యక్తిగత విభేదాలు లేవంటూ విజయసాయిరెడ్డి చెప్పారు.
ఇక వ్యవసాయమేనంటూ...
తన భవిష్యత్ ఇక వ్యవసాయంగానే ఉంటుందని తెలిపారు. ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి కొంత రాజకీయాలపై అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆయనను ఈడీ విచారించింది. దీంతో పాటు విజయసాయిరెడ్డి తనకు, చంద్రబాబుకు మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. ఆయనను ఇటీవల వైసీపీ ఇన్ ఛార్జిగా విశాఖకు నియమించినా హటాత్తుగా నిర్ణయం తీసుకోవడంపై రాజకీయంగా చర్చ జరుగుతుంది.