YSRCP : వైసీపీకి పక్కా షాకే.. జగన్ కుమాత్రమే కాదు.. సాయిరెడ్డి రాజీనామా వెనక రీజన్ అదేనా?
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు;

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేయబోతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోవడం లేదని, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని ఆయన తెలిపారు. తనకు, చంద్రబాబుకు మధ్య వ్యక్తిగత విభేదాలు లేవంటూ విజయసాయిరెడ్డి చెప్పారు. అయితే ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. చెప్పలేదు కూడా. కానీ ఏదో జరిగి ఉంటుందన్నది మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జగన్ ను వీడి రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చారంటే బలమైన కారణమే ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
రాజ్యసభ రెన్యువల్ చేసినా...
జగన్ విజయసాయిరెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. విశాఖ ఇన్ ఛార్జిగా కూడా నియమించారు. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన వెంటే ఉన్నారు. జగన్ తో పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. విజయసాయిరెడ్డికి రెండోసారి కూడా రాజ్యసభ పదవిని జగన్ రెన్యువల్ చేశారు. అయితే విజయసాయిరెడ్డి హఠాత్తుగా మొత్తానికి మొత్తం రాజకీయాల నుంచి తప్పుకోవడమంటే సమ్ థింగ్ రాంగ్ అన్నది వైసీపీ నేతల నుంచి వినిపస్తున్న కామెంట్స్. విజయసాయరెడ్డి జగన్ కష్టాల్లో ఉన్నప్పుడల్లా వెంటే ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డికి అంటే 2019 నుంచి 2024 వరకూ పెద్దగా ప్రాముఖ్యత లభించలేదన్నది ఒక కారణంగా కనిపిస్తుంది. ప్రధానంగా కాకినాడ పోర్టు కేసు రాజీనామాకు అసలు కారణంగా తెలుస్తుంది. ఈడీ కేసు మెడకు చుట్టుకోవడంతో పాటు కాకినాడ పోర్టు తిరిగి చేజారి పోవడం కూడా రాజీనామాకు కారణమని చెబుతున్నారు. తన వల్ల అన అల్లుడు వ్యాపారాలపై ప్రభావం చూపుతుందని కూడా ఆయన ఆలోచించినట్లు కనపడుతుంది.
జగన్ కు కుడిభుజంగా...
మరొక వైపు విజయసాయిరెడ్డి జగన్ కు కుడి భుజంగా ఉంటున్నారు. పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉన్నారు. అయితే ఇంతటి అకస్మాత్తు నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది మాత్రంర జగన్ కు కూడా అర్థం కాకుండా ఉంది. తన భవిష్యత్ ఇక వ్యవసాయంగానే ఉంటుందని తెలిపారు. ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి కొంత రాజకీయాలపై అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆయనను ఈడీ విచారించింది. దీంతో పాటు విజయసాయిరెడ్డి తనకు, చంద్రబాబుకు మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. ఆయనను ఇటీవల వైసీపీ ఇన్ ఛార్జిగా విశాఖకు నియమించినా హటాత్తుగా నిర్ణయం తీసుకోవడంపై రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఇది నిజంగా జగన్ తో పాటు క్యాడర్ లోనూ కోలుకోలేని దెబ్బేనని అనుకోవాలి. రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా రాజీనామాకు ఒక కారణంగా చూడాలంటున్నారు. మొత్తం మీద విజయసాయిరెడ్డి రాజీనామాల వైసీపీలో బాంబు పేలినట్లయింది.