YSRCP : ప్రత్యేక హోదా సాధనకు ఇదే మంచి సమయం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడానికి ఇదే మంచి సమయమని వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు.;

vijayasai reddy
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడానికి ఇదే మంచి సమయమని వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్వీట్ చేస్తూ చంద్రబాబు తలచుకుంటే ప్రత్యేక హోదాను సాధించడం సులువేనని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. సులభంగా ప్రత్యేక హోదాను సాధించుకునేందుకు ఇంతకు మించిన సమయం మరొకటి దొరకదని ఆయన అన్నారు.
ప్రభుత్వాన్ని ఒప్పించి...
కేంద్ర ప్రభుత్వం టీడీపీ మద్దతుపై ఆధారపడి ఉండటంతో ఒప్పించి ప్రత్యేక హోదాను సాధించాలని కోరారు. ఎన్డీఏకు కూడా చంద్రబాబు అవసరం ఉండటంతో ప్రత్యేక హోదా రాష్ట్రానికి దక్కించుకోవడం సులువని ఆయన అభిప్రాయపడ్డారు.