TDP : టెక్కలిలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరడంతో...?
టెక్కలిలో వైసీపీ ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ టీడీపీలో చేరారు;
టెక్కలిలో వైసీపీ ఎదురుదెబ్బ తగిలింది. టెక్కలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ టీడీపీలో చేరారు. ఆయన టెక్కలిలోని పదిహేడో వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. ఆయనతోపాటు కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గా ున్న దువ్వాడ జయశ్రీతో పాటు పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
దువ్వాడ సోదరుడు...
దీంతో టెక్కలి నియోజకవర్గంలో ఎన్నికల వేళ వైసీపీికి ఇబ్బందిగా మారింది. సొంత సోదరుడే పార్టీని వీడివెళ్లండం దువ్వాడ శ్రీనివాస్ కు ఎదురుదెబ్బేనని అంటున్నారు. దువ్వాడ శ్రీకాంత్, జయశ్రీలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.