జగన్ కీలక నిర్ణయం.. అతనికే ఎమ్మెల్సీ

ఇటీవల మరణించిన కరీమున్నీసా స్థానంలో ఎమ్మెల్సీ పదవిని ఆ కుటుంబానికే ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.

Update: 2021-12-13 13:15 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల మరణించిన కరీమున్నీసా స్థానంలో ఎమ్మెల్సీ పదవిని ఆ కుటుంబానికే ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సమాచారం ఆ కుటుంబానికి అందించారు. కరీమున్నీసా కుమారుడు రూహుల్లాకి జగన్ ఎమ్మెల్సీ సీటును ఖరారు చేశారు.

తొలి నుంచి వైసీపీకి.....
ఇటీవల విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా గుండెపోటుతో మరణించారు. కరీమున్నీసా కుమారుడు తొలి నుంచి వైసీపీ నేతగా విజయవాడలో వ్యవహరిస్తున్నారు. కానీ కరీమున్నీసాకు మహిళల కోటా కింద గతలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఆమె మరణించడంతో ఇప్పుడు కుమారుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిసైడ్ చేశారు.


Tags:    

Similar News