రంగు మార్చుకుంటున్న ఏపీ ఆర్టీసీ

జగన్ ప్రభుత్వం పల్లెవెలుగు బస్సుల రంగుల్లో స్వల్ప మార్పులు చేసేందుకు శ్రీకారం చుట్టింది.

Update: 2021-12-06 05:48 GMT

ఆర్టీసీ బస్సుల రంగు మారనుంది. మీరు చదువుతోంది నిజమే. తెలంగాణ ఆర్టీసీ మాదిరి ఏపీ ఆర్టీసీ బస్సులన్నీ ఒకే కలర్ లో ఉంటాయి. పల్లె వెలుగు ఒక కలర్, డీలక్స్ బస్సులన్నీ మరో కలర్, సూపర్ లగ్జరీలకు ఇంకో కలర్, ఇలా బస్సును చూడగానే అది ఏ బస్సో చెప్పేయచ్చు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో నడిచే బస్సులకు పల్లెవెలుగు అని పేరు పెట్టారు. ఆ పేరుతోనే ఇప్పటికీ ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలు వాటి పేర్లను, రంగులను మార్చలేదు.

స్వల్ప మార్పులతో....
తాజాగా జగన్ ప్రభుత్వం పల్లెవెలుగు బస్సుల రంగుల్లో స్వల్ప మార్పులు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటివరకు పల్లెవెలుగు బస్సులు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులతో ఉండగా, ఇప్పుడు వీటిలో పసుపు రంగును తొలగించి.. ఆ స్థానంలో గచ్చకాయ రంగును వేయనున్నారు. ఈ మార్పును ముందుగా రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో ఉన్న పల్లె వెలుగు బస్సులతో మొదలుపెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News