Ys Sunitha : జగన్ ఎందుకు భయపడుతున్నారు?

ముఖ్యమంత్రి జగన్ ఎందుకు భయపడుతున్నారని వైఎస్ సునీత ప్రశ్నించారు.;

Update: 2024-04-02 07:17 GMT
Ys Sunitha : జగన్ ఎందుకు భయపడుతున్నారు?
  • whatsapp icon

ముఖ్యమంత్రి జగన్ ఎందుకు భయపడుతున్నారని వైఎస్ సునీత ప్రశ్నించారు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ప్రజలందరికీ తెలుసన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై వివేకానందరెడ్డి కుమార్తె సునీత స్పందించారు. త తండ్రి హత్యను రాజకీయంగా గత ఎన్నికల్లో జగన్ వాడుకున్నారని సునీత ఆరోపించారు.

ఐదేళ్లు మాట్లాడకుండా...
ఐదేళ్లు ఏమీ మాట్లాడలేదని, ఇప్పుడు మళ్లీ ఎన్నికల కోసం వివేకా హత్య విషయం మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అవినాష్ ను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని జగన్కు భయమా అని ఆమె ప్రశ్నించారు. మరి జగన్ ఎందుకు భయపడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం రక్తంలో మునిగి ఉందని, దీని నుంచి బయటకొస్తేనే రాష్ట్రాభివృద్ధి' అని తెలిపారు.


Tags:    

Similar News