Breaking : మంగళగిరి వైసీపీ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవి

మంగళగిరి వైసీపీ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని నియమిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది;

Update: 2023-12-11 14:09 GMT
ganji chiranjeevi, ycp in-charge, mangalagiri, guntur district

Ganji chiranjeevi

  • whatsapp icon

మంగళగిరి వైసీపీ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని నియమిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అయోధ్య రామిరెడ్డి ప్రకటించారు. రాజకీయ సమీకరణాల వల్లనే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇవ్వలేదని ఆయన తెలిపారు ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. మంగళగిరి సీటును బీసీలకు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.

అందుకే నిర్ణయం...
వ్యక్తిగత కారణాల వల్లనే ఆర్కేను తప్పించారని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఆర్కే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు. సీఎం జగన్ కు ఆర్కే అత్యంత సన్నిహితులని అన్నారు. అందుకే మంగళగిరి నియోజకవర్గానికి గంజి చిరంజీవిని ఇన్‌ఛార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆర్కే కూడా మంగళగిరిలో వైసీపీ విజయానికి సహకరిస్తారని ఆయన అన్నారు.


Tags:    

Similar News