వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఊరట

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది;

Update: 2024-10-29 07:27 GMT

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. పుంగనూరు అలర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మిథున్ రెడ్డిపై నమోదయిన రెండు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.

మరో ఐదుగురికి ...
మిథున్ రెడ్డితో పాటు మరో ఐదుగురికి కూడా ముందస్తు బెయిల్ లభించింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా సూచించింది. మిధున్ రెడ్డి పుంగనూరులో పర్యటించినప్పుడు ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరు వర్గాలు బాహాబాహీకి తలపడ్డాయి. ఈ ఘటనల్లో మిధున్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
Full View


Tags:    

Similar News