Jagananna Cheyutha గుడ్ న్యూస్: నేడు అకౌంట్లలోకి డబ్బులు
వైఎస్ఆర్ జగనన్న చేయూత పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది
Jagananna Cheyutha:వైఎస్ఆర్ జగనన్న చేయూత పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది లబ్ధిపొందుతూ ఉన్నారు. నాలుగు సంవత్సరాల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాల జీవన పరిస్థితులను మెరుగుపరచడం, వెనుకబడిన మహిళలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. YSR చేయూత పథకం కింద నేడు నిధులను విడుదల చేయనున్నారు. లబ్ధిదారులు వారి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను ఉపయోగించి అందుకు అర్హులో కాదో తెలుసుకోవచ్చు. ప్రభుత్వం నుండి నిధులు విడుదలైన తర్వాత లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా 45–60 ఏళ్ల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నాలుగో విడత వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.18,750 చొప్పున నగదును ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. శాశ్వత జీవనోపాధి పొందేలా ప్రతి నెలా స్థిర ఆదాయం లభించేలా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో లబ్ధిదారునికి నాలుగు విడతల్లో మొత్తం రూ.75 వేల చొప్పున అందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా రూ.18,750 చొప్పున ప్రభుత్వం ప్రతి మహిళకు రూ.56,250 చొప్పున అందజేసింది. 4వ విడతగా అందించే రూ.5,060.49 కోట్లతో కలిపి.. ఏపీ ప్రభుత్వం ఈ ఒక్క పథకం ద్వారానే రూ.19,189.60 కోట్లు నిధులు విడుదల చేసింది.