YSRCP : నేటి నుంచి వైసీపీ కీలక సమావేశాలు.. నేతలతో జగన్
వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం నేడు జరగనుంది. వైసీపీ అధినేత జగన్ నేడు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు
వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం నేడు జరగనుంది. వైసీపీ అధినేత జగన్ నేడు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగే సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు హాజరు కావాలని ఆదేశాలు అందాయి. వీరందరితో జగన్ నేరుగా మాట్లాడతారు. వైసీపీకి 37 మంది ఎమ్మెల్సీలు, 11 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు ఎంపీలు, పదకొండు మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి.
ఎన్నిల ఫలితాల తర్వాత...
ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి నేతలతో నేరుగా జగన్ సమావేశమవుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాలను వారి ద్వారా అడిగి తెలుసుకోనున్నారు. దీంతో పాటు ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కూడా జగన్ నేతలతో మాట్లాడనున్నారు. కార్యకర్తలకు అండగా నిలవాలని, దాడుల్లో ఇబ్బంది పడిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసాను ఈ సమావేశం ద్వారా పంపనున్నట్లు తెలిసింది.