బంగారం పెట్టుబడిపై మరో సూపర్‌ ఛాన్స్‌

బంగారంపై పెట్టుబడి పెట్టే వారికి ప్రభుత్వం అందించే గోల్డ్ బాండ్ స్కీం మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ బాండ్ స్కీమ్..

Update: 2023-09-13 04:01 GMT

బంగారంపై పెట్టుబడి పెట్టే వారికి ప్రభుత్వం అందించే గోల్డ్ బాండ్ స్కీం మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ బాండ్ స్కీమ్2023-24 రెండవ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి ఓపెన్‌ అయ్యింది. ఈ స్కీమ్‌ సెప్టెంబర్ 15 వరకు కొనసాగనుంది. ఈసారి 1 గ్రాము బంగారం ధర రూ.5,923గా నిర్ణయించారు. ఆన్‌లైన్ ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లోనూ ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేందుకు అవకాశం ఉంది.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే మీకు రూ. 50 తగ్గింపు లభిస్తుంది. అంటే గ్రాముకు రూ. 5,873 ఖర్చు అవుతుందన్నట్లు. సావరిన్ గోల్డ్ బాండ్‌లో మీరు 24 క్యారెట్ అంటే 99.9% స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెట్టె అవకాశం ఉంటుంది. ఇప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్ గురించి.. దానిలో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే ప్రయోజనాల కూడా ఉన్నాయి.

సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏమిటి?

సావరిన్ గోల్డ్ బాండ్ అనేది ప్రభుత్వ బాండ్. దీన్ని డీమ్యాట్‌గా మార్చుకోవచ్చు. ఐదు గ్రాముల బంగారం బాండ్ అయితే, బాండ్ ధర ఐదు గ్రాముల బంగారం ధరతో సమానంగా ఉంటుంది. ఈ బాండ్స్ ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) జారీ చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్‌లో, మీరు 24 క్యారెట్ల అంటే 99.9% స్వచ్ఛమైన బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు. ఈ పెట్టుబడుల పై 2.50% వార్షిక వడ్డీ వస్తుంది. డబ్బు అవసరమైతే, ఈ బాండ్‌స్ నుంచి లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ పబ్లిష్డ్ రేట్ ఆధారంగా బాండ్ ధర నిర్ణయిస్తారు. ఇందులో సబ్‌స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలోని చివరి మూడు రోజుల రేట్ల ఏవరేజ్ లెక్కిస్తారు.
ఈ బాండ్‌లో స్వచ్ఛత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకారం.. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రచురించిన 24 క్యారెట్ల స్వచ్ఛత బంగారం ధరతో బంగారు బాండ్ల ధర ముడిపడి ఉంది. దీనితో పాటు, దీనిని డీమ్యాట్ రూపంలో ఉంచవచ్చు. ఇది చాలా సురక్షితమైనది. దానిపై ఎటువంటి ఖర్చు ఉండదు.

ఎంత వరకు పెట్టుబడి పెట్టవచ్చు..?

సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ ద్వారా ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము నుంచి గరిష్టంగా 4 కిలోల బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ హోల్డింగ్ విషయంలో 4 కిలోల పెట్టుబడి పరిమితి మొదటి దరఖాస్తుదారుపై మాత్రమే వర్తిస్తుంది. అయితే ఏదైనా ట్రస్ట్ ఈ బాండ్స్ కొనాలంటే దానికి గరిష్ట పరిమితి 20 కిలోల వరకూ ఉంటుంది.

ఈ ఇన్వెస్ట్‌మెంట్‌పై టాక్స్ ఉంటుందా?

సావరిన్ మెచ్యూరిటీ వ్యవధి 8 సంవత్సరాలు. మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత దాని ద్వారా వచ్చే లాభాలపై టాక్స్ ఉండదు. అయితే మీరు మీ డబ్బును 5 సంవత్సరాల తర్వాత ఉపసంహరించుకుంటే దాని నుంచి వచ్చే లాభం పై దీర్ఘకాలిక మూలధన లాభం బాండ్‌ రూపంలో 20.80% పన్ను విధిస్తారు.

పెట్టుబడి పెట్టడం ఎలా..?

ఈ సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆర్బీఐ అనేక ఆప్షన్లను ఇచ్చింది. బ్యాంకు బ్రాంచీలు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు. పెట్టుబడిదారు దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. దీని తర్వాత, మీ అకౌంట్‌ నుంచి డబ్బు కట్‌ అవుతుంది. ఈ బాండ్‌లు మీ డీమ్యాట్ ఖాతాకు ట్రాన్స్ఫర్ అవుతాయి.
Tags:    

Similar News