Apple iPhone 16 Leaks: త్వరలో iPhone 16.. ఫీచర్స్‌ లీక్‌..!

టెక్ మార్కెట్‌లో ఐఫోన్‌కు క్రేజ్ పెరుగుతోంది. ఏడాదికి ఒక ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేసే ఈ సంస్థ ఇటీవల తన 15 సిరీస్‌లను..

Update: 2023-12-10 11:45 GMT

iPhone 16

టెక్ మార్కెట్‌లో ఐఫోన్‌కు క్రేజ్ పెరుగుతోంది. ఏడాదికి ఒక ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేసే ఈ సంస్థ ఇటీవల తన 15 సిరీస్‌లను ప్రవేశపెట్టింది. యాపిల్ కంపెనీకి చెందిన ఈ కొత్త ఫోన్ రికార్డు స్థాయిలో అమ్ముడవుతోంది. ఐఫోన్ 15 సిరీస్ విడుదలైనప్పుడు స్టోర్‌ల ముందు క్యూ కట్టిన సందర్బాలున్నాయి. అలాగే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి ఒక దశలో నో స్టాక్‌ కూడా కనిపించింది. Apple తదుపరి ఫోన్ iPhone 16 సిరీస్. ఈ ఫోన్ తయారీ ఇప్పుడు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే ఇందులోని కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి.

ఐఫోన్ 16 సిరీస్ లాంచ్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఇప్పుడు ఈ ఫోన్‌కు సంబంధించిన ఒక వార్త టెక్ మార్కెట్లో వైరల్ అవుతోంది. ఐఫోన్ 16 ఫీచర్ల విషయానికొస్తే, కొన్ని లీక్‌లు గట్టిగా వినిపిస్తున్నాయి. డిజైన్, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల గురించి కొన్ని వార్తలు గుప్పుమంటున్నాయి. తదుపరి iPhone 16 సిరీస్‌లో iPhone 16, iPhone 16 Pro, iPhone 16 Pro Max, iPhone 16 Plus ఉంటాయి. ఐఫోన్ 16 ప్రో 6.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని, ప్రో మాక్స్ 6.9-అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 16 6.1-అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 16 ప్లస్ 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని లీకులు చెబుతున్నాయి.

శాంసంగ్ అందించిన OLED స్క్రీన్ ఈ సిరీస్ ఫోన్‌లలో ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇందులో మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీ ఉంటుందట. ఐఫోన్ 16 సిరీస్ 3-నానోమీటర్ A18 చిప్‌, కెమెరా విషయానికొస్తే, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ 'టెట్రా-ప్రిజం' టెలిఫోటో కెమెరాను కలిగి ఉన్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మెరుగైన ఫోటోలను తీయడానికి ఆప్టికల్ జూమ్‌ను 3x నుండి 5xకి పెంచవచ్చు. ఐఫోన్ 16 ప్రో సిరీస్ కోసం ఉపయోగించిన 48-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా తక్కువ వెలుతురులో కూడా అధిక-నాణ్యత ఫోటోలను తీయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2024లో విడుదల కానున్న ఐఫోన్ 16 సిరీస్ గురించి అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది.

Tags:    

Similar News