మీ బ్యాంకు అకౌంట్‌ స్థంభించిపోయిందా? ఈ కారణం కావచ్చు

ప్రస్తుత రోజుల్లో బ్యాంకు ఖాతా తీయాలంటే పాన్‌కార్డు, ఆధార్‌ వివరాలు తప్పనిసరి. ఇది ఇవి లేకుండా బ్యాంకు ఖాతాను తీయలేరని ..

Update: 2023-09-12 06:18 GMT

ప్రస్తుత రోజుల్లో బ్యాంకు ఖాతా తీయాలంటే పాన్‌కార్డు, ఆధార్‌ వివరాలు తప్పనిసరి. ఇది ఇవి లేకుండా బ్యాంకు ఖాతాను తీయలేరని గుర్తించుకోండి. అయితే మీకు ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్నట్లయితే కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం.. బ్యాంకులో కేవైసీ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పించని పక్షంలో మీకు బ్యాంకు అధికారులు మెసేజ్ పంపుతారు. మీరు స్పందించకుంటే బ్యాంకు ఖాతా స్తంభించి పోతుంది. ఎలాంటి లావాదేవీలు జరపలేరు. సదరు ఖాతాలను యాక్టివేట్ చేసుకోవడానికి కూడా ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయి. బ్యాంకు ఖాతాదారుల 'కేవైసీ' నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి.

హై రిస్క్ కస్టమర్లు ప్రతి రెండేండ్లకోసారి కేవైసీ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ రిస్క్ ఖాతాదారుల ఎనిమిదేండ్ల నుంచి పదేండ్ల వరకు కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 2019 మే 29న జారీ చేసిన కేవైసీ సర్క్యులర్’ను ఆర్బీఐ గత మే నాలుగో తేదీన అప్ డేట్ చేసింది. దీని ప్రకారం.. ప్రతి బ్యాంకు ఖాతాదారు పాన్ కార్డు గానీ, ఫామ్-16 గానీ సమర్పించకుంటే ఆ ఖాతా తాత్కాలికంగా నిలిచిపోతుంది.

అలా తాత్కాలికంగా నిలిచిపోయిన బ్యాంకు ఖాతాను రీయాక్టివేట్ చేసుకోవడానికి మీరు నేరుగా బ్యాంకు శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కేవైసీ ఫామ్ నింపి అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించి అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుకు కాకుండా ఆన్‌లైన్‌లో కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆన్ లైన్ బ్యాంకింగ్ లో లాగిన్ కావాలి. కేవైసీ ట్యాబ్ మీద క్లిక్ చేసి.. స్క్రీన్ మీద వచ్చే సూచనలకు అనుగుణంగా మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ తదితర వివరాలు అందించాలి. ఆధార్, పాన్, ఇతర పత్రాలను స్కాన్‌ చేసి ఆ కాపీలను అప్‌లోడ్‌ చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్ నొక్కితే సరిపోతుంది. బ్యాంకు నుంచి మీకు సర్వీస్ నంబర్ వస్తుంది. ఈ సర్వీస్ నంబర్ మీ రిజిస్టర్ ఫోన్ నంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో గానీ, ఈ-మెయిల్ లో గానీ వస్తుంది.

Tags:    

Similar News