eSIM: ఇకపై ఈ-సిమ్ యుగం వస్తుందా? ఎయిర్‌టెల్‌ సీఈవో కీలక అప్‌డేట్‌

స్మార్ట్‌ఫోన్‌లో డేటా కనెక్టివిటీకి అత్యంత ముఖ్యమైన విషయం సిమ్ కార్డ్. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ..

Update: 2023-11-24 02:47 GMT

స్మార్ట్‌ఫోన్‌లో డేటా కనెక్టివిటీకి అత్యంత ముఖ్యమైన విషయం సిమ్ కార్డ్. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, సాంకేతికతలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటిలో ఒకటి కొత్త ఇ-సిమ్ ట్రెండ్. ఇది ఇప్పుడు ఫిజికల్ సిమ్ కార్డ్‌లను భర్తీ చేయడం ప్రారంభించింది. ఇది ఫిజికల్ సిమ్ అవసరాన్ని పూర్తిగా తొలగిస్తోంది. దీని కారణంగా ప్రజలు ఫిజికల్ సిమ్ కార్డ్‌ని ఇన్‌స్టాల్ చేయకుండానే ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని టెలికాం సేవలను ఉపయోగించుకునే అవకాశాన్ని పొందుతారు. అయితే ఈ-సిమ్ యుగం నిజంగా వచ్చిందా? ఎయిర్‌టెల్‌కి చెందిన గోపాల్ విట్టల్ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం.

టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్, ఫిజికల్ సిమ్ కార్డ్ కంటే ఈ-సిమ్ చాలా విషయాల్లో మంచిదని అభిప్రాయపడ్డారు. అనేక మిడ్‌రేంజ్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు వినియోగదారులకు ఇ-సిమ్‌ని ఉపయోగించుకునే అవకాశాన్ని ఇస్తున్నాయి. అన్ని ప్రధాన టెలికాం కంపెనీలు కూడా ఇ-సిమ్‌ను అందిస్తున్నాయి. ఎందుకంటే ఈ-సిమ్‌లో ఫోన్ దొంగతనాన్ని నిరోధించడం నుండి డేటాను బదిలీ చేయడం వరకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ట్రాకింగ్ సులభం

మీరు మీ ఫోన్‌లో ఇ-సిమ్‌ని ఉపయోగిస్తే పోగొట్టుకున్న ఫోన్‌ను రాబట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఫోన్‌ పోయినట్లయితే దొంగిలించిన వ్యక్తి సిమ్‌ కార్డును తీసివేసి ఫోన్‌ను ఎంచక్క వాడుకుంటాడు. కానీ eSIM ఉంటే దానిని తీసేందుకు వీలుండదు. ఈ సిమ్‌ వల్ల పోయిన ఫోన్‌ సులభంగా ట్రాక్‌ చేసి కనిపెట్టవచ్చు. దీని వల్ల ఫోన్‌ల దొంగతనాలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. SIM కార్డ్ ఫోన్ వర్చువల్ సాఫ్ట్‌వేర్‌లో ఒక భాగం కాబట్టి, ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేయడంలో ఎలాంటి సమస్య ఉండదు.

ఎక్కువ పరికరాలను కనెక్ట్ చేయవచ్చు

ఇ-సిమ్ సేవతో, ఇంటర్‌కనెక్ట్ చేయబడిన పరికరాలను ఒకే నంబర్‌కు లింక్ చేసే ఎంపిక ఇవ్వబడుతోంది. ఉదాహరణకు, మొబైల్ ఫోన్‌ల నుంచి స్మార్ట్‌వాచ్‌ల వరకు అన్ని పరికరాలను ఒకదానితో ఒకటి అనుసంధానించవచ్చు. అన్నింటిలో టెలికాం సేవలు అందుబాటులో ఉంటాయి. అంటే, మీరు ఫోన్‌కు బదులుగా స్మార్ట్‌వాచ్‌ని మాత్రమే ఉపయోగించాలనుకుంటే లేదా మీకు ఒకటి కంటే ఎక్కువ ఫోన్‌లు ఉంటే, అప్పుడు ఒక ఇ-సిమ్ అందరికీ కనెక్టివిటీని అందిస్తుంది.

ఇలా ఇ-సిమ్ ఉపయోగించండి

మీరు ఇ-సిమ్‌ని ఉపయోగించడం ప్రారంభించాలనుకుంటే, ముందుగా మీ ఫోన్ eSIMకు సపోర్ట్‌ చేస్తుందా? లేదా? అనేది చూడాలి. మీ ఫోన్ e-SIMకి సపోర్ట్ చేస్తే, మీరు టెలికాం ఆపరేటర్‌ని సంప్రదించాలి. Jio నుంచి Airtel, Vi వరకు, ప్రతి ఒక్కరూ e-SIM ఎంపికను అందిస్తున్నారు. మీరు మీ ఫిజికల్ సిమ్ కార్డ్‌ని ఇ-సిమ్‌గా కూడా మార్చుకోవచ్చు.

సాధారణ సిమ్‌ నుంచి ఈ-సిమ్‌కు మారడం వల్ల వినియోగదార్లకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని గోపాల్‌ విట్టల్‌ వెల్లడించారు. అందువల్ల ఎయిర్‌టెల్‌ ఈ-సిమ్‌ ఫీచరును సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ఫోన్లను కలిగినవారు, ఇ-సిమ్‌కు మారాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాధారణ సిమ్‌కు ఆన్‌లైన్‌ ఎక్స్‌టెన్షనే ఇ-సిమ్‌ అని వివరించారు.

Tags:    

Similar News