TRAI: ఇక ఆ కాల్స్‌, మెసేజ్‌లకు చెక్.. ట్రాయ్‌ కీలక నిర్ణయం

ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్లు ఒక భాగమైపోయాయి. ఫోన్‌లు లేనిది గడవని పరిస్థితి ఉంది. ఫోన్‌లతో కోట్లాది వ్యాపారాలు

Update: 2023-11-23 02:47 GMT

ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్లు ఒక భాగమైపోయాయి. ఫోన్‌లు లేనిది గడవని పరిస్థితి ఉంది. ఫోన్‌లతో కోట్లాది వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఫోన్‌ లేని పరిస్థితి ఎలా ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మాట అటుంచితో చాలా మందికి స్పామ్‌ కాల్స్‌, ఇతర పనికిరాని అవాంఛిత కాల్స్‌ రావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాల్స్‌ కాకుండా మెసేజ్‌లు సైతం పదేపదే వస్తుంటాయి. ఆఫర్ల పేరిట, జాబ్స్‌ పేరిట ఇలా ఒక్కటేమిటి రకరకాల మెసేజ్‌లు, కాల్స్‌ తెగ ఇబ్బంది పెడుతుంటాయి. కానీ ఆ కాల్స్‌గానీ, మెసేజ్‌లు గానీ ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది తెలియదు. ఒక వేళ ట్రూ కాలర్స్‌లో చెక్‌ చేసినా ఏదో ఒక పేరు పడుతుంటుంది. అయితే మొబైల్‌లో do not disturb ఆప్షన్‌ పెట్టుకున్నా కాల్స్ అవాంఛిత కాల్స్‌, సందేశాలు వస్తున్నాయిన వినియోగదారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వాటికి చెక్‌ పెట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మొబైల్ ఫోన్ కస్టమర్‌లు అవాంఛిత కాల్‌లు, Messageలను వెంటనే గుర్తించడంలో సహాయపడటానికి దాని do not disturb యాప్‌లోని లోపాలను సరిదిద్దడానికి కృషి చేస్తోందని TRAI కార్యదర్శి వి రఘునందన్ తెలిపారు.

ఈ యాప్‌లోని లోపాలను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కొన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌లలో సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యాయని, మార్చి నాటికి అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ యాప్‌ని అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

ఇక ట్రాయ్‌ పేరుతో కూడా మోసం జరుగుతోంది. ఇలాంటి మోసగాళ్ల పట్ల సాధారణ ప్రజలు జాగ్రత్త వహించాలని టెలికాం నియంత్రణ సంస్థ వినియోగదారులను ఇటీవల కోరింది. వెంటనే ఆన్‌లైన్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేసింది. కొన్ని కంపెనీలు, ఏజెన్సీలు వ్యక్తులకు కాల్ చేస్తున్నాయని TRAI వ్యక్తులమని చెబుతూ మొబైల్‌ నంబర్‌ బ్లాక్‌ అవుతుందని కాల్స్‌ చేస్తున్నట్లు గుర్తించింది. దీంతో పాటు పలు నంబర్లు కూడా బ్లాక్ అయ్యాయి. అవాంఛిత సందేశాలను పంపడానికి ఇది జరుగుతోందని ట్రాయ్‌ అభిప్రాయపడింది.

ఈ కంపెనీలు, ఏజెన్సీలు, వ్యక్తులు తమ ఆధార్ నంబర్‌ను పొందేందుకు ఉపయోగించిన సిమ్ కార్డును చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని, ఇలా చేయడం ద్వారా మోసగాళ్లు కూడా స్కైప్ వీడియో కాల్‌లలోకి వచ్చేలా వినియోగదారులను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ట్రాయ్‌ ఎవ్వరి మొబైల్‌ నంబర్‌ బ్లాక్‌ చేయదని స్పష్టం చేయడం, డిస్‌కనెక్ట్‌ చేయడం ఉండదని తెలిపింది.

ఫిర్యాదు చేయండిలా..

ఇలా సమస్యలు ఎదుర్కొన్న బాధిత వ్యక్తులు సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌లకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ట్రాయ్‌ సూచించింది. కస్టమర్ కేర్ సెంటర్ నంబర్‌లలో లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.inలో లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.

Tags:    

Similar News