Egg : కోడిగుడ్డు ధరలు ఇంత పెరిగితే.. భవిష్యత్‌లో తినగలమా?

కోడిగుడ్డు ధర గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-01-02 02:40 GMT

Consumers are expressing concern as the price of egg has increased more than ever before

కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మాంసం ధరలు అందుబాటులో లేదు. ఇక పేదవాడి పౌష్టికాహారమైన కోడిగుడ్డు ధర కూడా మంటెక్కుతుంది. కోడిగుడ్డు ధర గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఆరోగ్యం కోసం కోడిగుడ్డును ఎక్కువ మంది వినియోగిస్తారు. పౌష్టికాహారం కావడంతో కోడిగుడ్డు తినడం మంచిదని వైద్యులు కూడా సూచిస్తుండటంతో కోడిగుడ్డు వాడకం పెరిగిపోయింది.

ఉత్పత్తి తగ్గడంతో...
అయితే చలికాలంలో కోడిగుడ్ల ఉత్పత్తి తక్కువ కావడంతోనే ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. కోడిగుడ్డు ఎక్కువ మంది వినియోగించే ఆహార వస్తువు కావడంతో డిమాండ్ కూడా ఎక్కువయింది. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతోనే ధర పెరిగిందన్న వ్యాపారుల మాట నిజమని చెప్పక తప్పదు. కోడిగుడ్డు వినియోగం ఇటీవల కాలంలో ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. కోడిగుడ్డులో ఉండే పౌషికపదార్థాలు వాటి వినియోగాన్ని పెంచేలా చేశాయి.
ధర ఎలా ఉందంటే?
ప్రస్తుతం కోడిగుడ్డు ధరఎనిమిది రూపాయలకు చేరుకుందని చెబుతున్నారు. మొన్నటి వరకూ ఐదు రూపాయలు పలికిన ఒక కోడిగుడ్డు ధర నేడు ఎనిమిది రూపాయలకు వెళ్లింది. రానున్న కాలంలో వీటి ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. కోడిగుడ్లు ప్రస్తుతం ఒక కేసు ధర రెండు వందల రూపాయలకు చేరుకుందని చెబుతున్నారు. ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండటం కూడా ధరలు పెరుగుదలకు కారణంగా చూపిస్తున్నారు. భవిష్యత్ లో కోడిగుడ్డు ధర మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు.


Tags:    

Similar News