Indian Railways: రైలు బోగీపై ఉండే ఈ నంబర్ల అర్థం ఏంటో తెలుసా?

ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేసే ఉంటారు. దేశంలో అతిపెద్ద రవాణ వ్యవస్థ ఏది అంటే అది రైల్వే శాఖ అని చెప్పక తప్పదు...

Update: 2023-11-21 13:51 GMT

ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేసే ఉంటారు. దేశంలో అతిపెద్ద రవాణ వ్యవస్థ ఏది అంటే అది రైల్వే శాఖ అని చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తూ తమ తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. అయితే రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు కొన్ని విషయాలను గమనిస్తుండాలి. మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. రకరకాల అర్థాలు వచ్చే గుర్తులు, నేమ్‌ బోర్డులు, నెంబర్లు ఇలా ఎన్నో ఉంటాయి. కానీ మనం ఎన్నో సార్లు రైల్వే స్టేషన్‌కు వెళ్లినా.. రైల్లో ప్రయాణించినా పెద్దగా పట్టించుకోము. ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రైలు ప్రయాణం చేసేందుకు వెళ్లినప్పుడు ట్రైన్‌ బోగిపై కొన్ని నంబర్లను గమనించాలి. ఆ నంబర్లకు ఎన్నో అర్థాలు ఉంటాయి. కానీ అవి ఎందుకు ఉంటాయి? ఆ నంబర్ల అర్థం ఏమిటన్నది మీరెప్పుడైనా గమనించారా..?


Full View

ఉదాహరణకు బోగీపై 98337 నంబర్‌ ఉందానుకుందాం. ఈ నంబర్‌లోని మొదటి రెండు నంబర్లు అంటే 98 ఉంటే కనుక బోగీ తయారైన సంవత్సరాన్ని సూచిస్తుంది. అంటే 1998లో ఆ బోగీ తయారైందని అర్థం. ఇక మిగతా మూడు నంబర్లు 337 ఉంటే ఏరకమైన బోగీ అని తెలియజేస్తుంది. స్వీపర్‌ క్లాస్‌ బోగీనా, జనరన్‌ బోగీనా, లేక ఏసీ బోగీనా అనే విషయాన్ని తెలియజేస్తుంది.

1-200 మధ్యన ఉంటే అది ఏసీ క్లాస్‌ బోగీ అని అర్థం.

200-400 మధ్యన ఉంటే స్వీపర్‌ క్లాస్‌ బోగీ అని అర్థం.

400-600 మధ్యన ఉన్నట్లయితే జనరల్‌ క్లాస్‌ అని అర్థం.

ఇలా బోగీలపై ఉండే ఈ నంబర్లకు అర్థం ఇదన్నట్లు. ఇవే కాకుండా ఇలాంటి నంబర్లు చాలా ట్రైన్‌పై ఉంటాయి. వాటి అర్థాలు కూడా రకరకాలుగా ఉంటాయి. అందుకే మీరు రైలు ప్రయాణం చేసేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పడు ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం


Tags:    

Similar News