గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్
దసరా పండగ వేళ బంగారం ధరల్లో కొంత తగ్గుదల కనిపిస్తుంది. భారీగా కాకపపోయినా స్వల్పంగా తగ్గుదల కనిపించింది
దసరా పండగ వేళ బంగారం ధరల్లో కొంత తగ్గుదల కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కారణంగా పసిడి ధరల్లో హెచ్చు తగ్గులుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. దసరాకు కొనుగోలు చేసే వారికి కొంత వరకూ ఊరట కలిగించిందనే చెప్పాలి. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతుండటంతో మహిళలు జ్యుయలరీ దుకాణాలకు క్యూ కడుతున్నారు. తమకు ఇష్టమైన పసిడిని కొనుగోలు చేస్తున్నారు.
తగ్గిన ధరలు...
దేశంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.150లు తగ్గింది. కిలో వెండి ధరపై ఐదు వందల రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,950 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,950 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 73,600 వద్ద ట్రెండ్ అవుతుంది.