మీ ATM పిన్ మర్చిపోయారా? ఇలా చేయండి
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ అనేది..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ అనేది ఉంటుంది. ఇక బ్యాంకులకు అకౌంట్‌తో పాటు పాస్‌బుక్, ఏటీఎం కార్డును అందిస్తుంది. అయితే సాధారణంగా ప్రతి సారి బ్యాంకుకు వెళ్లి డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్తుంటాము. స్థితి ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అయితే సమీపంలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్తే క్షణాల్లో డబ్బు డ్రా చేసుకోవచ్చు. అయితే చాలా మంది ఒక్కోసారి పిన్ నెంబర్‌ను మర్చిపోతుంటారు. అలాంటి సందర్భాలలో ఇబ్బంది పడుతుంటారు. ప్రతి ఒక్కరూ ఇలా ఏటీఎం పిన్ మర్చిపోయి ఇబ్బంది పడటం ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా అనుభవంలోకి వచ్చే ఉంటుంది. దీంతో ఏటీఎంలో తప్పు పిన్ నంబర్‌ను మళ్లీమళ్లీ నమోదు చేయడం వల్ల ఏటీఎం కార్డు 24 గంటలపాటు బ్లాక్ అవుతుంటుంది. అలాంటి సమయంలో రోజు వరకు ఏటీఎం పని చేయదు. ఇలా పిన్ నంబర్ మర్చిపోయినట్లయితే ఎలాంటి టెన్షన్ పడవద్దు. ఏటీఎంలో కొత్త పిన్ నెంబర్‌ను జనరేట్ చేసుకోవచ్చు.
కొత్త పిన్ నెంబర్‌ను నమోదు చేసుకోవడం ఎలా..?
➦ ముందుగా మీరు ఏ బ్యాంకు ఏటీఎం వాడుతున్నారో సరిగ్గా అదే ఏటిం వద్దకు వెళ్లాలి.
➦ మెషీన్‌లో కార్డు ఇన్‌సర్ట్ చేసిన తర్వాత స్క్రీన్‌పై వచ్చే ఆప్షన్‌లను గమనించాలి.
➦ వాటిల్లో బ్యాంకింగ్‌పై క్లిక్ చేయాలి
➦ తర్వాత ఫర్ గెట్ పిన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
➦ అనంతరం బ్యాంకు అకౌంట్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్ అడుగుతుంది. నంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత ఆ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
➦ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఏటీఎం స్ట్రీన్‌పై నమోదు చేయాలి.
➦ అనంతరం కొత్త ఏటీఎం పిన్‌ని సెట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. వెంటనే పిన్ నంబర్ రూపొందించుకుంటే సమస్య తీరిపోయినట్లే..
ఆన్‌లైన్‌లో పిన్ సెంట్ చేసుకోవడం ఎలా..?
➦ ఆన్‌లైన్‌లో కూడా ఏటీఎం పిన్ నంబర్ మార్చుకోవచ్చు.
➦ సంబంధిత బ్యాంకు అధికారిక నెట్‌బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
➦ తర్వాత ఏటీఎం కార్డ్ ఆప్షన్‌లోకి వెళ్తే.. ఏటీఎం పిన్ ఛేంజ్ ఆప్షన్ కనిపిస్తుంది.
➦ దానిపై క్లిక్ చేసిన తర్వాత ఏటీఎం కార్డుపై సీవీవీ, కార్డ్ నంబర్ చివరి అంకెలు, వాలిడిటీ తేదీ, సంవత్సరం వివరాలను నమోదు చెయాలి.
➦ తర్వాత బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసిన రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
➦ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపిని నమోదు చేయాలి.
➦ తర్వాత కొత్త పిన్ నెంబర్‌ను నమోదు చేసుకుంటే సరిపోతుంది