Gold:బంగారం కొనొచ్చా?

బుధవారం నాడు బంగారం, వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది

Update: 2024-02-28 03:57 GMT

gold and silver prices

Gold Price:బుధవారం నాడు బంగారం, వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,590 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.62,830గా ఉంది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,600గా ఉంది. కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గింది. దేశంలో వెండి ధర ప్రస్తుతం కిలోకు 100 రూపాయలు తగ్గింది. ఈరోజు కేజీ వెండి ధర రూ.75,400 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,740 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,990 కి చేరుకుంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,590 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,830 గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,160గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,450గా ఉంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,590 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,830 గా నమోదైంది. విశాఖపట్నంలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,590 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,830 గా నమోదైంది.


Tags:    

Similar News