బంగారం దారెటు...

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా

Update: 2023-12-24 03:47 GMT

gold silver rates in hyderabad

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 200 పెరిగింది. దీంతో బంగారం ధర ఏకంగా రూ. 58 వేల మార్కు దాటేసింది. స్వచ్ఛమైన బంగారం ధర 24 క్యారెట్లపై రూ. 260 పెరిగి రూ. 63,490 వద్దకు చేరుకుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,350లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,640గా ఉంది. హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,490గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,750లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,090గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,490గా నమోదైంది.

వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండిపై రూ. 500 తగ్గి.. రూ. 79,000లుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 79,000గా ఉంది. బెంగళూరులో 77,000గా నమోదైంది ఉంది. హైదరాబాద్‌ లో కిలో వెండి ధర రూ. 80,500 వద్ద కొనసాగుతోంది. చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ. 80,500 వద్ద కొనసాగుతోంది.


Tags:    

Similar News