బంగారం, వెండి ధరలు ఎంతగా పెరిగాయంటే?

బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. బంగారం ధర 22 క్యారెట్లు

Update: 2024-07-12 02:41 GMT

బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. బంగారం ధర 22 క్యారెట్లు 200 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయలు పెరిగింది. వెండి రేటు కిలోపై ఏకంగా రూ.1000 మేర పెరిగి షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 1 లక్ష మార్క్ దాటేసింది. ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ. 67,450కు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ. 220 పెరిగి రూ. 73,570కి చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 67,300 కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 220 పెరిగింది. 73,420 కి చేరింది.

హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కిలోకు రూ.1000 మేర పెరిగింది. కిలో వెండి ధర రూ. 1,00,000 పలుకుతోంది. ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి రేటు 95,500 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు 2412 డాలర్ల వద్దకు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 31.33 డాలర్లు పలుకుతోంది.


Tags:    

Similar News