బంగారం ధర కాస్త తగ్గుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ బంగారం ధర ప్రస్తుతం రూ. 450 తగ్గి.. రూ. 68,140 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గడంతో 10 గ్రాములకు రూ. 74,350 వద్దకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,840కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,990 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,840 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో వెండి ధర రూ. 1450 తగ్గడంతో కేజీ రూ. 93,250 వద్ద కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా వెండి రూ. 1450 పడిపోయి కేజీ సిల్వర్ ధర రూ. 97,750 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2401.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు 30 డాలర్లు ఒక్కరోజులో పడిపోయింది. స్పాట్ సిల్వర్ ధర 29.23 డాలర్ల వద్ద ఉంది.