మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంత పెరిగిందంటే..

భారతదేశంలోని ప్రజలు బంగారంతో చేసిన వస్తువులను ఎక్కువగా ఇష్టపడుతుటారు. ఈ బంగారం ప్రపంచ ఉత్పత్తి, దేశ కరెన్సీ బలం..

Update: 2023-10-25 00:57 GMT

భారతదేశంలోని ప్రజలు బంగారంతో చేసిన వస్తువులను ఎక్కువగా ఇష్టపడుతుటారు. ఈ బంగారం ప్రపంచ ఉత్పత్తి, దేశ కరెన్సీ బలం, దేశీయ డిమాండ్ వంటి ఇతర వస్తువుల ధర మొదలైన అనేక అంశాలచే ప్రభావితమవుతుంది. చాలా మంది బంగారాన్ని పెట్టుబడి పెట్టేందుకు ఎంచుకుంటారు. మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంటారు. ప్రజలు బ్యాంకు డిపాజిట్లు లేదా స్టాక్ మార్కెట్‌కు బదులుగా బంగారంలో పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకుంటున్నారు, ఎందుకంటే బంగారం సాధారణంగా హామీ, నమ్మదగిన రాబడిని ఇస్తుంది. అలాగే ధరలు పెరిగినా తగ్గినా మహిళలు అత్యంతంగా ఇష్టపడేది బంగారం. ప్రతి రోజు బంగారం షాపుల్లో మహిళలతో కిటకిటలాడుతుంటాయి.

ఇక అసలు విషయానికొస్తే తాజాగా అక్టోబర్‌ 25న దేశంలో బంగారం ధరలు మళ్లీ పైపైకి లేస్తున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై 200 రూపాయల వరకు పెరిగి ప్రస్తతం 56,550 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారంపై 240 రూపాయలు ఎగబాకి ప్రస్తుతం 61,690 దాటింది. ఇక బంగారం ధర పెరిగితే వెండి మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. కిలోపై 500 వరకు తగ్గి ప్రస్తుతం 74,600 రూపాయలు ఉంది.

అత్యంత విలువైన, ఖరీదైన లోహాలలో ఒకటి బంగారం భారతదేశంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఆభరణాల రూపంలోనే కాదు. కానీ బంగారం, నాణేల రూపాల్లో కూడా విలువైనది. బంగారం ధరలు నిరంతరాయంగా పెరిగినప్పటికీ, భారతదేశంలో ప్రజలు బంగారంపై క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తున్నారు.

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,690 ఉంది.

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,700 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,840 ఉంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,690 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,690 ఉంది.

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,750 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,910 ఉంది.

Tags:    

Similar News