Gold And Silver: బంగారం ధరలు భారీగా తగ్గాయోచ్.. ఇంకా వెయిట్ చేయొచ్చా

కేంద్రం బంగారం, సిల్వర్ వంటి వాటిపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి

Update: 2024-07-24 03:30 GMT

కేంద్రం బంగారం, సిల్వర్ వంటి వాటిపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 2750 తగ్గి 10 గ్రాములకు రూ. 65,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర తులం రూ. 71,010కి చేరింది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ పసిడి ధర ఒక్కరోజులో రూ. 2750 తగ్గి.. తులం రూ. 64,950 కి చేరింది. కేవలం ఆరు రోజుల్లోనే తులం బంగారం ధర రూ. 3800 పతనమైంది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ రేటు తులం రూ. 2990 పతనమై ఇప్పుడు రూ. 70,860 కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర ఆరు రోజుల్లో ఏకంగా రూ. 4,140 తగ్గింది.

వెండి ధర రూ. 3500 తగ్గడంతో కేజీ వెండి ధర ఢిల్లీలో రూ. 88 వేల వద్ద ఉంది. హైదరాబాద్ నగరంలో రూ. 3500 తగ్గి కిలో వెండి ధర రూ. 92,500 కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2415 డాలర్లకు చేరుకుంది. స్పాట్ సిల్వర్ రేటు 29.28 డాలర్లు కొనసాగుతోంది.


Tags:    

Similar News