బంగారం.. కొనగలమా?

బంగారం ధరలు మరోసారి పెరిగిపోతూ ప్రజలకు షాక్ ఇస్తున్నాయి

Update: 2023-10-21 02:30 GMT

gold price today

బంగారం ధరలు మరోసారి పెరిగిపోతూ ప్రజలకు షాక్ ఇస్తున్నాయి. పండగ సీజన్ లో కొనుగోళ్లు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల తులం బంగారంపై 700 రూపాయల వరకు పెరిగింది. 24 క్యారెట్ల తులం బంగారంపై 770 రూపాయల వరకు పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 56,400 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,530 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,690 వద్ద కొనసాగుతూ ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,750 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు 56,400 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 61,530 వద్ద కొనసాగుతుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 61,530 రూపాయలు వద్ద ఉంది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.74,600 వద్ద కొనసాగుతోంది.


Tags:    

Similar News