బంగారం ధర మళ్లీ ఎంత పెరిగిందంటే?

గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి

Update: 2023-10-07 02:32 GMT

గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. శనివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 100 పెరగగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 70 పెరిగింది. శనివారం నాడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 52,500కి చేరుకోగా 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,500కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,230గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,850కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,650గా ఉంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,230గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 52,500కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.
బంగారం స్వల్పంగా పెరుగుల కనిపిస్తే వెండి ధర మాత్రం తగ్గింది. కిలో వెండిపై ఒకే రోజు రూ. 500 తగ్గింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో తగ్గుదుల కనిపిచింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 73,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 73,000గా నమోదైంది.


Tags:    

Similar News