Gold Price: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు

Update: 2023-11-09 02:37 GMT

దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్న బంగారం ధరలు.. తాజాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 150 రూపాయలు తగ్గగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 160 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశీయంగా చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 56,100 రూపాయలు ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర 61,200 రూపాయలు ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 56,600 ఉండగా,24 క్యారెట్ల ధర 61,750 రూపాయలు ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 56,100 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 61,200 రూపాయలు ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 56,250 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 61,350 రూపాయలు ఉంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 56,100 రూపాయలు ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,200 రూపాయలు ఉంది. ఇక కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు తగ్గి ప్రస్తుతం 73,500 వద్ద కొనసాగుతోంది.

Tags:    

Similar News