Gold Prices : పసిడి రా.. రామ్మంటుందిగా.. ఇక కొనేసి ధరించండి
బంగారం కొనుగోలు చేసే వారికి గత రెండు రోజులుగా గుడ్ న్యూస్ అందుతుంది. ధరలు పెరగడం లేదు. స్థిరంగా ఉన్నాయి
బంగారం కొనుగోలు చేసే వారికి గత రెండు రోజులుగా గుడ్ న్యూస్ అందుతుంది. ధరలు పెరగడం లేదు. కానీ తగ్గడమూ లేదు. కేవలం స్థిరంగానే కొనసాగుతున్నాయి. బంగారం అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. దానిన సొంతం చేసుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. డబ్బులుంటే చాలు మనసంతా బంగారంపైనే ఉంటుంది. మగవాళ్లను అడిగి మరీ ఉన్న డబ్బులతో మహిళలు పసిడిని కొనుగోలు చేయిస్తుంటారు. డబ్బులు లేకపోయినా పోగు వేసి మరీ కొనుగోలు చేయడం భారతీయ మహిళలకు అలవాటుగా మారింది.
కొత్త కొత్త డిజైన్లతో...
అదే వ్యాపారులకు వరంగా మారింది. పసిడి దుకాణాలు ఎప్పుడూ రద్దీగా ఉండటానికి ఇదే కారణం. జ్యుయలరీ దుకాణాల యాజమాన్యాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లతో మహిళలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించి సఫలమవుతుంటాయి. కొత్త డిజైన్ వచ్చిందంటే చాలు దానిని ఇంటికి తెచ్చుకునేంత వరకూ కొందరు నిద్రపోరు. అదే జ్యుయలరీ దుకాణాలు సక్సెస్ కావడానికి ప్రధాన కారణమయింది. అయితే ధరలు పెరుగుతుండటంతో బంగారం కొనుగోలు చేసిన నష్టమేమీ ఉండవకపోవడంతో దానిని పెట్టుబడిగా కూడా భావించేవారు అనేక మంది ఉంటారు.
నేడు కూడా స్థిరంగానే...
దేశంలో నేడు బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో గోల్డ లవర్స్ కు కొంత ఊరట చెందుతున్నారు. కొనుగోలు చేయడానికి రెడీ అయిపోయారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,800 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,050 రూపాయలుగా నమోదయింది. వెండి ధర కూడా కిలో 77,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.