Gold Price: బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకే..
ఈ రోజు బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు. ప్రతి రోజు పెరుగుతూ వస్తున్న పసిడి ధర డిసెంబర్ 3వ తేదీన మాత్రం..
ఈ రోజు బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు. ప్రతి రోజు పెరుగుతూ వస్తున్న పసిడి ధర డిసెంబర్ 3వ తేదీన మాత్రం భారీగానే పెరిగింది. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. భారతీయ సాంప్రదాయంలో మహిళలు పుత్తడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే బంగారం పెరుగుదలకు రకరకాల కారణాలు ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 750 రూపాయలు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 810 రూపాయల వరకు ఎగబాకింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
చెన్నై:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,150
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,530
ముంబై:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,450
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,760
ఢిల్లీ:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,600
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,910
కోల్‌కతా:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,450
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,760
హైదరాబాద్:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,450
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,760
బెంగళూరు:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,450
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,760
విజయవాడ:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,450
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,760
ఇక బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. నేనెందుకు తగ్గాలి అన్నట్లు వెండి ధర పెరిగింది. కిలో ధరపై వెయ్యి రూపాయల వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా కిలో సిల్వర్ ధర 80,500 రూపాయల వద్ద కొనసాగుతోంది.
బంగారం పెరుగుదలకు కారణాలు..
బంగారం డిమాండ్, సరఫరా మధ్య సమతుల్యత దాని ధరను నిర్ణయించే విషయం చాల కీలకం. బంగారం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది కాలక్రమేణా దాని విలువను నిలుపుకుంటుంది. అలాగే దాని కొరత దాని ఆకర్షణకు దోహదం చేస్తుంది. బంగారం సరఫరా ప్రధానంగా మైనింగ్ ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక అనిశ్చితి లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి కారణాల వల్ల బంగారానికి డిమాండ్ పెరగడం , దాని పరిమిత లభ్యతను ప్రతిబింబిస్తూ దాని ధర పెరుగుదలకు దారితీయవచ్చు.
ద్రవ్యోల్బణం రేట్లు పెరిగినప్పుడు, సంప్రదాయ పెట్టుబడులు విలువను కొనసాగించడానికి కష్టపడవచ్చు, పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లేలా చేస్తుంది. దాని అంతర్గత విలువ కరెన్సీ విలువ తగ్గింపు ద్వారా ప్రభావితం కాకుండా ఉంటుంది. పండుగల సమయంలో బంగారం ధర ఎందుకు వేగంగా పెరుగుతుందో మీరు తరచుగా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే భారతదేశంలో బంగారానికి సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు దారి తీస్తుంది.