బంగారం కొనాలనుకుంటున్నారా.. మీకో గుడ్ న్యూస్
బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. హైదరాబాద్‌లో తులం బంగారం ధర
బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ. 100 తగ్గగా 22 క్యారెట్లకు ప్రస్తుతం రూ. 57,600 మార్కుకు చేరింది. 24 క్యారెట్లపై రూ. 110 పడిపోగా తులానికి ఇప్పుడు రూ. 62,840 కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం రేట్లు తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్స్ తులం బంగారం రూ. 57,750 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,940 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ. 400 తగ్గగా.. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 74,500 కు చేరింది. హైదరాబాద్ నగరంలో వెండి ధరలు మారలేదు. కిలో రూ. 76,400 పలుకుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,740 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,930గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,590 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 62,830గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,090గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,370గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,590గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,830గాను ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,590గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,830గా నమోదైంది.