Gold Price Today : గుడ్ న్యూస్ ...బంగారం సొంతం చేసుకోవడానికి....కొనేయండి ఇదే మంచి సమయం
బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. మొన్నటి వరకూ ధరలు తగ్గినట్లే తగ్గి ఊరించిన బంగారం ధరలు మళ్లీ పెరగుతున్నాయి.
బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. పసిడితో పాటు వెండి కూడా పరుగులు తీస్తుంది. మొన్నటి వరకూ ధరలు తగ్గినట్లే తగ్గి ఊరించిన బంగారం ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. అందులోనూ సీజన్ ప్రారంభం కావడంతో ధరలు ఇక ఆగేది లేదని మార్కెట్ నిపుణుల అంచనాలు నిజమవుతున్నాయి. బంగారం, వెండి వస్తువులకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. దానికి ఒక సీజన్ అంటూ ఉండదు. ఎప్పుడు చేతిలో డబ్బులుంటే అప్పుడు బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ప్రజలు జ్యుయలరీ దుకాణాలకు క్యూ కడుతుంటారు. అందుకే సీజన్ తో సంబంధం లేకుండా జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం రకరకాల డిజైన్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.
సీజన్ కావడంతో...
ఇక శ్రావణమాసం కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ఇప్పటికే ప్రారంభమయింది. మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం, వెండి కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయని జ్యుయలరీ దుకాణాల వ్యాపారులు చెబుతున్నారు. కొనుగోలు చేయదలచుకున్నవారు ఇప్పుడే బంగారం, వెండి కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. అందుకు అనుగుణంగానే మహిళలు తాము ఇష్టపడే బంగారాన్ని కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతున్నారు. అయితే ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో హెచ్చు తగ్గులుంటాయి.
నేడు స్థిరంగా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. బంగారం నిన్న ఒక్కరోజే పది గ్రాముల పై మూడు వందల రూపాయలు పెరిగింది. అయితే నేడు ధరలు స్థిరంగా కొనసాగుతుండటంతో కొనుగోలుకు మంచి సమయం అని సూచిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,450 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,310 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 88,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.