Gold Price Today : గోల్డ్ లవర్స్ కు నేడు గుడ్ న్యూస్ బంగారం ధరలు పెరగలేదుగా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.
బంగారం అంటే ఇష్టపడని వారు అతి తక్కువగా ఉంటారు. ముఖ్యంగా మహిళల్లో 99 శాతం మంది పసిడి అంటేనే ఇష్టపడి వాటిని కొనుగోలు చేసుకునేందుకు అనేక ఆపసోపాలు పడుతుంటారు. తాము దాచుకున్న కొద్ది మొత్తంతోనైనా బంగారం కొనుగోలు చేస్తే మంచిదని, భవిష్యత్ కు కూడా భరోసాగా ఉంటుందని భావిస్తారు. అందుకే బంగారానికి అంత డిమాండ్ ఉంటుంది. ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతుండటంతో కొనుగోలు చేసేవారి సంఖ్య కొంత తగ్గుముఖం పట్టిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరగడం వల్లనే కొనుగోళ్లు కూడా మందగించాయంటున్నారు.
రానున్న రోజుల్లో...
అయితే బంగారం రానున్న రోజుల్లో ధరలు పెరిగడమే కాని, తగ్గడం అంటూ జరగదని, అందుకే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. నగదుగా మార్చుకోవచ్చు. సులువుగా వాటిని మార్పిడి చేసుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా బంగారం విషయంలో సులువైన మార్గంలో తిరిగి తాము పెట్టిన పెట్టుబడిని తెచ్చుకునే అవకాశముంది. అందుకే పసిడికి మరింత గిరాకీ పెరిగింది. అయినా సరే ఇటీవల థన్ తెరాస్ రోజు కూడా కొనుగోళ్లు తగ్గడంతో వ్యాపారులు ఒకింత నష్టపోయారు. ఎక్కువ అమ్మకాలు జరుగుతాయని ఆశించినా జరగలేదు.
ధరలు స్థిరంగా...
బంగారం అంటే పడి చచ్చిపోయే వారు కూడా ధరలను చూసి ఒకింత వెనకడుగు వేస్తున్నారు. తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చునన్న ధోరణికి వచ్చేశారు. ఇటీవల గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ కనిపిస్తున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,700 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,400 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 1,06,000 రూపాయలుగా కొనసాగుతుంది.