నేల చూపులు చూస్తున్న పసిడి.. మంచిదేగా
మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి
మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకుల ప్రకారం బంగారం ధరల్లో హెచ్చు తగ్గులుంటాయి. ద్రవ్యోల్బణంతో పాటు డాలర్ తో రూపాయి తగ్గుదల, కస్టమ్స్ డ్యూటీ పెంచడం వంటి కారణాలతో కూడా బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అయితే వరసగా కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ గోల్డ్ లవర్స్ ను జ్యుయలరీ దుకాణలవైపునకు పరుగులు పెట్టిస్తున్నాయి.
ఈరోజు ధరలు...
తాజాగా దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల రూపాయలు తగ్గింది. వెండి కిలో ధరపై పన్నెండు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర53,500 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,200 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర భారీగా తగ్గి 76,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.