Gold Prices Today : బంగారం ధరలు రికార్డు స్థాయికి.. ఇక కొనడం సాధ్యమా?
గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా అంతే విధంగా పెరుగుతున్నాయి
పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాటికి కళ్లెం పడటం లేదు. అదే సమయంలో వెండి కూడా పరుగులు పెడుతుంది. భారతీయ సంస్కృతి లో భాగమైన బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేని విధంగా గత కొద్ది రోజుల నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి. అందరి అంచనాలకు మించి ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయడం అంటే పేద, మధ్య తరగతి వారికి మరింత భారంగా మారిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
మదుపు చేద్దామన్నా...
ఈనెల 28వ తేదీ వరకూ పెళ్లిళ్ల ముహూర్తాలున్నాయి. తర్వాత మూడు నెలలు ముహూర్తాలు లేవు. ఈ సమయంలో బంగారం ధరలు అమాంతంగా పెరిగి గోల్డ్ లవర్స్ ఆశలను నీరు గారుస్తున్నాయి. మదుపు చేద్దామని భావించేవారికి కూడా పసిడి ధరలు వింటేనే దడ పుట్టించేలా ఉన్నాయి. రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ధరలు ఎంత వరకూ వెళతాయన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం కూడా బంగారం ధరలపై పడనుంది.
ధరలు ఇలా...
గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా అంతే విధంగా పెరుగుతున్నాయి. వాటికి కళ్లెంపడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,660 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,630 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 88,100 రూపాయలుగా ఉంది.