Gold Rates : పెరుగుతున్న బంగారం ధరలు.. రానున్న కాలంలో మరింతగా

బంగారం ధరలు తగ్గుతున్నాయనుకునేలోపు మళ్లీ పెరుగుతున్నాయి. దీపావళి సమయానికి ధరలు మరింత పెరిగే అవకాశముంది

Update: 2023-11-03 03:12 GMT

బంగారం ధరలు తగ్గుతున్నాయనుకునేలోపు మళ్లీ పెరుగుతున్నాయి. దీపావళి సమయానికి ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఇక పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పసిడి ధరలు మరింత పరుగులు తీసే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం పది గ్రాములు అరవై ఐదు వేల రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదని అంచనా వేస్తున్నారు. ఇటీవల బంగారం ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గినట్లు చెబుతున్నారు. మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో డిమాండ్‌‌కు తగిన బంగారం లభించే అవకాశం లేక ధరలు పెరుగుతాయంటున్నారు.

రానున్న రోజుల్లో...
అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులను తగ్గించడం వంటివి కూడా బంగారం ధరల్లో పెరుగుదలకు కారణమని చెప్పక తప్పదు. అలా అని భారతీయ సంస్కృతి ప్రకారం బంగారాన్ని కొనుగోలు చేయకుండా ఉండలేని పరిస్థితి. వివాహాలకు, శుభకార్యాలకు ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేయాల్సి రావడం సంప్రదాయంగా వస్తుండటంతో రానున్న కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. వెండి కిలో ధరపై ఏడు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,500 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,640 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్ లో 77.700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News